హార్ధిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ..55బంతుల్లో 158

455
hardikpandy
- Advertisement -

గాయం నుంచి కొలుకున్న తర్వాత హార్ధిక్ పాండ్యా అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. డీవీ పాటిల్‌ టీ20 కప్‌లో హార్ధిక్ తన సత్తా చాటుతున్నాడు. డీవీ పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌ 1 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పాండ్య. సెమీ ఫైనల్ లో భాగంగా హార్ధిక్ పాండ్య రెచ్చిపోయాడు. కేవలం 55బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్‌ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 6ఫోర్లు, 20సిక్సర్లు తో చెలరేగిపోయాడు.

హార్దిక్‌ వీరవిహారం చేయడంతో రిలయన్స్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. . కొన్ని నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ కొద్దిరోజుల క్రితమే మైదానంలో అడుగుపెట్టాడు. అనంతరం ఛేదనలో బీపీసీఎల్‌ జట్టు 15.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రిలయన్స్‌ టీమ్‌ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎలాగైనా మళ్లీ భారత జట్టులో రీ ఎంట్రీ కోసం చాలా కష్టపడుతున్నాడనే చెప్పుకోవాలి.

- Advertisement -