- Advertisement -
టీంఇండియా ఆల్ రౌండర్ హార్ధిక పాండ్య తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. వెన్నెముక గాయంతో దాదాపుగా ఆరునెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న హార్ధిక ఇటివలే ప్రాక్టీస్ ప్రారంభించాడు. డీవై పాటిల్ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్-1 జట్టు తరఫున ఆడాడు. ఈమ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు హార్ధిక్. 25బంతుల్లోనే 38పరుగులు చేశాడు.
అంతేకాకుండా మూడు కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈమ్యాచ్ లో భాగంగా దేశవాళీ క్రికెట్‌లో ఇంటర్నేషనల్ హెల్మెట్ వాడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడేటప్పుడు, టీమిండియా కిట్‌కు సంబంధించిన వస్తువులు వాడకుడదు. బీసీసీఐ నిబంధనలకు ఇది విరుద్ధం. మరి దీనిపై బీసీసీఐ ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
- Advertisement -