ఒక్క ట్వీట్‌…కొంపముంచింది

273
Hardik Pandya and Parineeti Chopra - Love Affair
- Advertisement -

ఒక్క ట్వీట్ పెద్ద దుమారాన్ని రేపింది. ఓ క్రికెటర్‌కు.. బాలీవుడ్ హీరోయిన్‌కు మధ్య  ఎఫైర్‌ను అంటగట్టేసింది. అప్పటి వరకు భారత్‌కు గొప్ప ఆల్‌రౌండర్ దొరికాడు.. కపిల్ తర్వాత అంతటి ఆటగాడు దొరికాడు అని పొగిడిన ఫ్యాన్సే.. ఒక్కసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు.

అసలు విషయానికొస్తే.. భారత్.. శ్రీలంక పర్యటనలో ఉండగా, మన యంగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందంటూ వార్తలొచ్చాయి. దీనిపై బాలీవుడ్ భామ ఇప్పటికే స్పందించి.. తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చేసింది.

Hardik Pandya and Parineeti Chopra - Love Affair
అయితే తాజాగా ఈ వ్యవహారంపై పాండ్యా కూడా రియాక్ట్‌ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాతూ.. ‘‘నాకు ఎవరితో అఫైర్ ఉందన్నా పట్టించుకోను.. కానీ పరిణితీ చోప్రాతో మాత్రం ఏం లేదు.

ఎందుకంటే ఆమె గురించి నాకు ఏమీ తెలియదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ట్వీట్‌తో మొదలైన గొడవ ఇప్పుడైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

- Advertisement -