బ్లడీ బోల్డ్ అంటున్న చెర్రి..

206
- Advertisement -

విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన మూవీ ‘అర్జున్‌ రెడ్డి’. విజయ్ దేవరకొండ హీరోగా ,సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేటికీ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై కొందరు విమర్శలు చేస్తుంటే.. మరికొందరు ప్రశంసిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంపై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ప్రశంసలు కురిపించాడు. ‘రంగస్థలం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆదివారం అర్జున్ రెడ్డి సినిమా చూశాడు.

It's a bloody bold film: Ram Charan about 'Arjun Redydy' movie ..‘‘అర్జున్ రెడ్డి సినిమా చూశాను. రా, రియలిస్టిక్ అండ్ బ్లడీ బోల్డ్. సందీప్ వంగ, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే, రాహుల్ రామకృష్ణతో పాటు మొత్తం చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్’’ అని అభినందించాడు చరణ్.

రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

- Advertisement -