మరో షాకిచ్చిన కేంద్రం..!

174
hardeep
- Advertisement -

ఓ వైపు ప్రజల నుండి ఎన్ని నిరసనలు వస్తున్న కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పెట్రో,డీజీల్,గ్యాస్ ధరల పెరుగులతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తుండగా తాజాగా విమాన ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది కేంద్రం.

విమాన టికెట్ల ధరల కనిష్ఠ పరిమితిని 5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. విమాన ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి శుక్రవారం పేర్కొన్నారు.

ఏటీఎఫ్‌ ధరల పెరుగుదల కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను గత నెలలో కేంద్రం 10-30 శాతం పెంచింది. గతేడాది మే నెలలో దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన సందర్భంగా విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించి టికెట్ల ధరలపై పరిమితులు విధించారు.

- Advertisement -