సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?

416
sankranthi
- Advertisement -

సంక్రాంతి సకల శుభాలను, ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను మోసుకొచ్చే పండగ. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ అందరికి శుభాలను కలిగిస్తుంది. సం అంటే మిక్కిలి.. క్రాంతి అంటే అభ్యుదయం.. సంక్రాంతి అంటే మంచి సంవృద్ధిని ఇచ్చేటటువంటి రోజు అని అర్ధం. మనకు ప్రతి నెలలోనూ మాస సంక్రాంతి వస్తుంది. సూర్యభగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల పాటు ఉంటాడని. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే రోజును రవి సంక్రమణంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు.

మన దేశంలోని హిందువులే కాదు.. విదేశాల్లో ఉండే వారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు

సంక్రాంతి అంటే ఒక్కరోజులో హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. మూడ్రోజుల మురిపెం అంత కన్నా కాదు. రావటానికి నెల, పోవటానికి నెల సమయం తీసుకునే పండగ. ఆ గమనాగమన కాలమంతా తన జ్ఞాపకాలను, సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండగ. ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి ఆగమన ఆనవాళ్లు మన కళ్లకు కడతాయి. ముంగిళ్లు అందమైన ముగ్గులతో పరవశిస్తాయి. సంక్రాంతి విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

హేమంత రుతువులో మార్గశిర మాసపు శీతగాలులు… మంచు కురిసే వేళలు… ఇదే తరుణంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశిలోకి అడుగుపెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి..

తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందునుంచే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో ఇంటిముందు రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. నెలరోజుల పాటు తన హరినామ సంకీర్తనతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు. హరిణి కీర్తిస్తూ వచ్చే హరిదాసు సాక్షాత్ కృష్ణుడే ఈ రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు.

అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలవాళ్ల, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక కోళ్లపందాలు, ఎడ్లపందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి.

ఈ పండగ ప్రత్యేక ఏమిటంటే.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు బాహురమణీయంగా ఉంటాయి. గంగిరెద్దులు పండుగ బహుమానంగా బట్టలు పిండివంటలు.. ధ్యాన్యం ఇస్తే.. అవి కృతజ్ఞతగా తలలు ఊపే దృశ్యం చూడచక్కనైంది. అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు చేసే సందడి అంతాఇంతాకాదు..కాలక్రమంలో గంగిరెద్దులాట మాయమైపోతుంది.. కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువును తీర్చిద్దితారు పురాణ హితిహాసాలతో కూడిన బొమ్మలను కొలువుగా ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు సందడి చేస్తారు.మన ఆచార, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ గ్రేట్‌ తెలంగాణ టీవీ ప్రేక్షకులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

Also Read:సంక్రాంతి విజేత హనుమాన్

- Advertisement -