నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం..

667
Mother's Day 2021
- Advertisement -

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం.. ప్రతీ సంవత్సరం మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృ దినోత్స వానికి సుదీర్ఘ చరిత్ర నేపథ్యం ఉంది. గ్రీస్లో రియా అని దేవతను మదర్ ఆఫ్ గాడ్ గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించే వారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో తల్లులకు గౌరవపూర్వకంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపించేవారు. జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 19 14 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్‌రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది అప్పటి నుంచి ఏటా మే రెండవ ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అని అంటారు. నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు, మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే కానీ నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తుంది. కొందరు అమ్మతనం లోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతను గుర్తించుకోవాలి పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి. కనిపించే దైవం అమ్మ. అనురాగానికి చిరునామా అమ్మ. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశించే ఏ చిన్న తప్పు చేసిన కడుపులో దాచుకొని కనిపిస్తుంది. ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూ నే ఉంటుంది. కన్నపేగు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది ఇలా తమ కోసం సర్వస్వాన్ని ధారపోసి పెంచి పెద్ద చేసిన తల్లులు వారి జీవిత చరమాంకంలో కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం.

- Advertisement -