‘కనుమ’ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

91
- Advertisement -

తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగలో చివరి రోజునే కనుమ అంటారు. దీనినే పశువుల పండుగ అనికూడా అంటారు. రైతుల సంతోషానికి గుర్తుగా జరుపుకునే సంక్రాంతిలో కనుమ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగను పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కనుమ రోజున పంటనిచ్చే భూమికి, రైతులకు వ్యవసాయంలో సహకరించే గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. ఇక కనుమ రోజున ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించడం పూర్వం నుంచి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. .

ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఇక కనుమరోజున కొత్తబియ్యం మరియు పాలు కలిపి పొంగలి వండి.. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యంలా పెట్టిన తరువాత పొలానికి తీసుకెళ్లి ఆ పొంగలిని చల్లుతారు. దీన్నే పోలిచల్లడం అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల పంటలకు చీడపురుగులు రావట. ఇక ఇదే రోజున ఇంటికొచ్చిన బంధు మిత్రుల కొరకు మాంసాహారం వండుతారు. అలాగే కోడి పందేలు, వివిధ రకాల ఆటల పోటీలు, టోర్నమెంట్ లు వంటి వాటితో పాటు వివిధ రకాల వినోద కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. ఇలా కనుమ రోజున ఇంటిల్లపాది జరిగే సందడి కోలాహలంతో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతాయి. ఇక చివరి రోజు కనుమ పండుగతో సంక్రాంతి ముగుస్తుంది. మొత్తానికి మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ ఆచారాలు, సంప్రదాయాలు మనదేశ సంస్కృతి ని గుర్తు చేస్తుంటాయి.

Also Read:బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రిగా చంద్రశేఖర్

- Advertisement -