హ్యాపీ బర్త్ డే….షాలిని పాండే

395
shalini pandey
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి షాలిని పాండే. తొలి సినిమాతో తన అద్బుత నటనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే అవకాశం వచ్చిన ఏ చిన్న పాత్రను వదలడం లేదు.

సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన మహానటి,100 పర్సెంట్ లవ్ రీమేక్‌,కళ్యాణ్ రామ్ 118లోనూ తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం స్వీటి అనుష్క ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న నిశ్శబ్దంలో కీలకపాత్రలో నటిస్తుండగా షాలిని బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసి విషెస్ తెలిపింది చిత్రయూనిట్.

బాలీవుడ్ లో నటించాలన్నది తన చిరకాల కోరికని తెలిపిన షాలిని… ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో వేడి పుట్టించే షాలిని ఇలాంటి బర్త్ డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -