హ్యాపీ బర్త్ డే టూ మాస్ మహారాజా రవితేజ

165
raviteja
- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సైడ్ క్యారెక్టర్లు.. తర్వాత హీరోగా కష్టపడి పైకొచ్చాడు రవితేజ. ఇడియట్‌తో అలరించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయితో మెప్పించిన.. వెంకితో మాస్ హీరో అనిపించుకున్న అది రవితేజకే చెల్లింది. వెంకి, విక్రమార్కుడు,దుబాయ్ శీను వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ క్రేజ్ తెచ్చినా తర్వాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి కిక్ చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట లో 1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు.అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు.

మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే రవితేజ,అచ్చం ఆయనలాగే సైడ్ క్యారెక్టర్లతో మొదలుపెట్టి, అగ్రకథానాయకుడిగా ఎదగడం విశేషం.రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేది దర్శకనిర్మాతల ధీమా.అందుకే ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడుతుంటారు.

హిట్లు ఫ్లాపుల గురించి రవితేజ ఆలోచించరు.తన ప్రయత్నాన్ని మాత్రం వంద శాతం పెట్టి కష్టపడతారు.. ఫ్లాప్ అయితే ఏడుస్తూ కూర్చోను,హిట్ అయితే పార్టీ చేసుకోను అంటూ ఫలితాలకు అతీతంగా,తను ఆచరించే కర్మసిద్ధాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పడం రవితేజకే చెల్లింది. 90వ దశకంలో సినీ కెరీర్లోకి అడుగుపెట్టిన రవితేజ, ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు.ఎన్ని కష్టాలు పడినా,తనకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ ను వదులుకోకూడదనుకునే దృఢసంకల్పమే,ఆయన చేత సక్సెస్ ను టేస్ట్ చేయించింది. ఆయన మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని కోరుకుంటూ greattelangaana.com మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -