బాహుబలి-2 ‘భల్లాలదేవ’ ఫస్ట్ లుక్‌..

207
rana-daggubatis
- Advertisement -

టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి 2. దర్శకుడు రాజమౌళి ఫస్ట్ పార్ట్‌ ను తలదన్నేలా బాహుబలి 2 ను తెరకెక్కిస్తుండడంతో..సినిమా అంచనాలు ఇంకాస్త రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే బాహుబలి 2 ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన జక్కన్న తాజాగా అందులో విలన్ పాత్ర పోషిస్తున్న రానా పుట్టిన రోజు సందర్భంగా..భల్లాల దేవ ఫస్ట లుక్ ను రిలీజ్ చేశాడు. బాహుబలి ది కంక్లూజన్ లో రానాకి సంబంధించిన పోస్టర్ కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. పరాక్రమంతుడైన భళ్లాలదేవుడు రూపంలో రానా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో, చేతిలో తన పాత గదను పట్టుకుని బహుశా తన కుమారుడు భద్ర తల నరికిన శివుడితో ఢీ కొట్టేందుకు నడిచివస్తున్నట్లు ఉంది.

rana-daggubatis

హీరో రానా దగ్గుబాటి తొలిసారిగా నెగెటివ్ రోల్ చేసినా కూడా.. ”బాహుబలి” సినిమాలో తన అత్యంత క్లాసిక్ ప్రదర్శనతో భయంకరమైన క్రూరుడు భల్లాలదేవగా అందరినీ ఆకట్టుకున్నాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఇప్పుడు ”బాహుబలి 2” సినిమా నుండి రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు రాజమౌళి. అదిగో వస్తున్నా అరివీరభయంకరుడు అంటూ మనోడు ఈ లుక్ ను రిలీజ్ చేయడం విశేషం. గతంలో బాహుబలి 1 పోస్టర్లలో రానా తాలూకు యంగ్ లుక్ ను చూపిస్తే.. ఈసారి బాహుబలి కొడుకు శివుడుతో తలబడే సీనియర్ రానా దగ్గుబాటిని పోస్టర్ పై ఆవిష్కరించారు.

ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శివుడి పోస్టర్ వదిలిన బాహుబలి టీం, ఇప్పుడు భల్లాలదేవుడి లుక్ ను వదిలింది. తెలుగు, తమిళ్, మళయాళం(పల్వల్తేవన్) భాషల్లో కూడా పోస్టర్లు వదలటం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకి గుమ్మడికాయ కొట్టనుంది. ఏప్రిల్ 28, 2017న బాహుబలి- ది కంక్లూజన్ విడుదల కానుంది. బాహుబలితో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న రానా మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే రానా.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్లు అందాయి. బాబాయ్ నిన్న బర్త్ డే జరుపుకుంటే.. అబ్బాయి ఇవాళ చేసుకుంటున్నాడు. గురు గా వెంకీ స్టెప్పులతో టీజర్ అందించి అదరగొడితే, ఆర్మీ ఆఫీసర్ గా రానా ఘాజీ పోస్టర్ తో ఆకట్టుకున్నాడు. బాహుబలి 2 భల్లాలదేవ లుక్‌తో పుట్టినరోజు అసలు గిఫ్ట్ అందుకున్నాడు కండలవీరుడు రానా.

- Advertisement -