హ్యాపీ బర్త్ డే…రాహుల్ రవీంద్రన్

175
rahul ravindran
- Advertisement -

నటుడిగా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత మెగా ఫోన్ పట్టిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. అందాల రాక్షసి,అలా ఎలా?,హౌరా బ్రిడ్స్(2018),టైగర్ వంటి సినిమాల్లో నటించిన రాహుల్ తర్వాత దర్శకుడిగా మారారు.ఇవాళ రాహుల్ బర్త్ డే.

తన తొలి సినిమా చి.ల.సౌతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలిసినిమాకే జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత వరుస ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా నాగార్జునతో మన్మథుడు 2 చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ప్రభావం చూపించలేదు. దీంతో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై కన్నేశాడు రాహుల్.

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని పెళ్లి చేసుకున్న రాహుల్…ఒక డిఫరెంట్ వెబ్ సిరియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న రాహుల్ రవీంద్రన్‌ మరెన్నో హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -