హ్యాపీ బర్త్‌డే నిత్య..

237
Happy Birthday to Nithya Menon

ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం హీరోయిన్ ‘నిత్యా మీనన్’ సోంతం. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా తన సోలో పెర్ఫార్మన్స్ తో కుర్రకారుని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, సింగర్ గా కూడా తన టాలెంట్ చూపించుకుంది.  హీందీ, తమిళ్‌, మళయాలంతో పాటు, తెలుగులో కూడా ఏ మాత్రం తగ్గకుండా తన పెరఫార్మెన్సుతో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే వుంది నిత్య.

నిత్య పెరఫార్మెన్సు చూసిన  ఏ ప్రేక్షకుడికైనా ‘గుండెజారి గల్లంత’వ్వాల్సిందే. అంతేనా..? నిత్యా కోసమే ‘ఓ చిన్నదాన నీ కోసం’ అంటూ థియేటర్లకు వెళ్ళినవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా అందరి మనసుల్ని దోచేసుకున్న నిత్యమీనన్‌ బర్త్‌ డే ఈ రోజు.
 Happy Birthday to Nithya Menon
బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ.. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లో  ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది నిత్య.  నిజానికి నిత్యకి సినీ పరిశ్రమ కొత్తేం కాదు. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్‌’ అనే సినిమాలో బాల నటిగా చేసింది. ఇందులో ప్రముఖ నటి టబుకి చెల్లెలిగా నటించింది.

2006లో ‘7 ఓ క్లాక్‌’ అనే కన్నడ చిత్రంతో నిత్య పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత మలయాళంలో ‘ఆకాశ గోపురం’ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ సరసన మెరిసింది. ఆకాశ గోపురం సినిమాలో నటిస్తున్నప్పుడు నిత్య ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ‘స్టార్క్‌ వరల్డ్‌ కేరళ’ అనే టూరిస్ట్‌ మ్యాగజైన్‌పై నిత్య ఫొటో చూసి మోహన్‌లాల్‌ ఈ సినిమాలో అవకాశమిచ్చారట.
Happy Birthday to Nithya Menon
అయితే సినిమాల్లోకి వచ్చాక గానంపై మరింత ఆసక్తి పెంచుకుంది నిత్య. ‘అలా మొదలైంది’ సినిమాతో నందిని రెడ్డి నిత్యకు పాడే అవకాశం కల్పించారు. అలా నిత్య ‘ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది’ పాట పాడారు. ఆ తర్వాత వచ్చిన ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల్లోనూ పాడి  నిజంగానే ఆడియెన్స్‌ ని ఇష్క్ లో పడేసింది.  నిత్య ఇలాగే సక్సెస్‌ఫుల్ గా సినిమాలతో దూసుకుపోతూ..ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటూ…నిత్యమీనన్‌కి greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.