చిరంజీవి జీవితంపై సినిమా …!

204
Movie on Chiranjeevi Life History

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మిస్టర్. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి),ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శుక్రవారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు,నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శేఖర్ కమ్ముల పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు బెనర్జీ… చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా పైకి వచ్చిన వారిలో చిరంజీవి ఒకరని…ఆయన పడ్డ కష్టాలు తనకు తెలుసన్నారు.

Movie on Chiranjeevi Life History

చిరంజీవి జీవితంపై ఓ సినిమా తీస్తే బాగుంటుందని తెలిపారు.నాకు వచ్చిన ఆలోచన చెబుతున్నాను. చిరంజీవిగారి జీవిత చరిత్రను సినిమాగా తీస్తే బాగుంటుంది. సినీ రైటర్స్ .. చిరంజీవి గారి పర్మిషన్ తీసుకుని సినిమా తీస్తే బాగుంటుంది. చిరంజీవి గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన పయనాన్ని సినిమాగా తీయాలి. ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి పేరు వినగానే తనకు గుర్తుకు వచ్చేది ‘ఖైదీ’ అని, ఆ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి ‘ఖైదీ’ అని, ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిన విషయమేనని అన్నారు. త్వరలో విడుదల కానున్న మిస్టర్ చిత్రం గురించి తాను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవికి ‘మిస్టర్’ హీరోయిన్ లావణ్య  త్రిపాఠి శుభాకాంక్షలు చెప్పింది. ఎందుకంటే, చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’వ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు తన శుభాకాంక్షలు చెబుతున్నానని ‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన లావణ్య త్రిపాఠి పేర్కొంది. మిస్టర్ చిత్రంలోని మరో హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడింది. మొదట ఇంగ్లీషులో మాట్లాడిన హెబ్బా, ఆ తర్వాత తనకు వచ్చిన తెలుగులో కొంచెం సేపు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, కడుపుబ్బ నవ్వుకునేలా చేసింది. ,