హ్యాపీ బర్త్ డే…నాగచైతన్య

328
naga chaitanya
- Advertisement -

జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నటుడు నాగచైతన్య. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్’ చిత్రంతో తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం అయ్యాడు నాగ్‌. నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం ‘ఏం మాయ చేసావే’ లో ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రంలో చైతూ నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ సినిమా నుంచే చైతు-సమంత మధ్య మొదలైన ప్రేమ, చాలా ఏళ్ళు ప్రేమలో గడిపాక పెళ్లి చేసుకున్నారు. ఇవాళ చైతూ పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1986 నవంబరు 23న అక్కినేని నాగార్జున,లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)లకు జన్మించారు నాగచైతన్య.2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. తర్వాత ‘ప్రేమమ్’ , ‘సాహసమే శ్వాసగా సాగిపో’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’,శైలజా రెడ్డి అల్లుడుతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చైతూ ఇలాంటి బర్త్ డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -