కాబోయే అధ్యక్షురాలు హిల్లరీ క్లింటన్ పుట్టినరోజు…

280
- Advertisement -

అమెరికా సంయుక్త రాష్ర్టాలకు ఎన్నికలు జరుగడం సాధారణమే.. కానీ, ఈ సారి జరిగే ఎన్నికలు ఆ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి.శ్వేతసౌధం కోసం హోరాహోరీగా జరుగుతున్నపోటీలో హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ నామినేషన్‌కు అర్హత సంపాదించిన తొలిమహిళగా చరిత్ర సృష్టించిన హిల్లరీ… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. అతి సుదీర్ఘ ప్రజాస్వామ్య దేశానికి తొలి అధ్యక్షురాలిగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై అన్నివిధాలా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న హిల్లరీ…అగ్రరాజ్య పీఠానికి అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే జరిగిన మూడు డిబెట్‌లలో ట్రంప్ పై పైచేయి సాధించిన హిల్లరీ…అమెరికా ప్రజల మనసులను గెలవడంలో సక్సెసైంది .ఇవాళ హిల్లరీ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

bill-clinton-hillary-clinton

ఏ విషయంలోనైనా పట్టువదలని నేతగా పేరొందిన హిల్లరీ రోధమ్ క్లింటన్ 1947, అక్టోబర్ 28వ తేదీన చికాగో రాష్ట్రంలో జన్మించారు. వెల్లస్లీ కాలేజీనుంచి 1969లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1973లో లా డిగ్రీ పూర్తి చేసి, లీగల్ కౌన్సెల్‌గా కెరీర్ ప్రారంభించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. 1975లో బిల్‌క్లింటన్‌ను పెండ్లి చేసుకొన్న తర్వాత అర్కాన్సాస్ వెళ్లారు. బిల్ క్లింటన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. పిల్లల బాధ్యతలు చూసుకొంటూనే 1978లో లీగల్ సర్వీసెస్ కార్పొరేషన్‌కు తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

clinton

హిల్లరీ భర్త బిల్ క్లింటన్‌1993-2001 మధ్ యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.భర్త అడుగుజాడల్లో నడిచిన హిల్లరీ 2000 సంవత్సరంలో న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ప్రథమ మహిళగా ఉంటూ సెనెటర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అనంతరం 2006 లోనూ రెండోసారి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం బరాక్ ఒబామాతో పోటీ పడి ఓడిపోయారు. తర్వాత ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2013 వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నామినేషన్ సంపాదించి ప్రచారంలో దూసుకెళుతున్నారు.

hillari

1997నుంచి2001వరకు బిల్‌క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తొలి మహిళగా హిల్లరీ ప్రధానమైన విధాన నిర్ణయాల్లో చొరవ తీసుకున్నారు. చిన్నారులకు ఆరోగ్య బీమా పథకం తీసుకురావడంలోనూ ఆమె క్రియాశీల పాత్ర పోషించారు. 2000వ సంవత్సరంలో ఆమె న్యూయార్క్‌కు తొలి మహిళా సెనెటర్‌గా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై దాడి చేయాలన్న జార్జ్ బుష్ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. ఆ తర్వాతికాలంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేయడాన్ని ఖండించారు.

Bill And Hillary Clinton

అమెరికా దశ దిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై హిల్లరీకి అపారమైన అనుభవం ఉంది. ఉద్యోగాల కల్పనకు దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయంటూనే దృఢమైన, స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు సేవఅందించడానికి సిద్ధమంటూ ప్రకటించింది. ఉద్యోగాల కల్పనకు మార్గాలను ప్రజలకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కార్పొరేట్ లొసుగులు తొలగిస్తానంటూనే… సంపన్నులకు పన్ను రాయితీలు ఇచ్చే అంశంపై తన భావాలను స్పష్టంగా బయటపెట్టింది. ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలను ఏకంచేస్తామని ప్రకటించింది హిల్లరీ. ఇప్పటివరకు జరిగిన అన్ని డిబెట్‌లలో పై చేయి సాధించిన హిల్లరీకి…సర్వేలు కూడా అనుకులంగానే ఉన్నాయి.

sanders_clinton_trump

అన్ని అర్హతలు ఉన్న హిల్లరీనే అధ్యక్ష పదవికి అర్హురాలు… అమెరికాలో మార్పును తీసుకురాగలిగేది హిల్లరీనే అంటూ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అమెరికా శ్వేతసౌధం కోసం హోరాహోరీగా జరుగుతున్నపోటీలో హిల్లరీ క్లింటన్ డెమొక్రాటిక్ నామినేషన్‌కు అర్హత సంపాదించిన తొలిమహిళగా చరిత్ర సృష్టించిన హిల్లరీ… అగ్రరాజ్యం ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై 240 ఏండ్ల అమెరికా చరిత్రను తిరగరాయాలని కోరుకుంటూ greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -