డేవిడ్ బెక్ హామ్…సాకర్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఫ్రాన్స్ నాలుగు దేశాలలో లీగ్ టైటిల్స్ గెలుచుకున్న మొదటి ఇంగ్లీష్ ఆటగాడు. తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ బెక్ హామ్ బర్త్ డే.
1992లో 17 సంవత్సరాల వయస్సులో ఆరంగేట్రం చేసిన బెక్ హామ్ తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. యునైటెడ్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ఆరుసార్లు, FA కప్‌ను రెండుసార్లు మరియు 1999లో UEFA ఛాంపియన్స్ లీగ్‌ని గెలుచుకున్నాడు. రియల్ మాడ్రిడ్‌తో నాలుగు సీజన్లు ఆడిన బెక్ హామ్..ఆ క్లబ్‌తో తన చివరి సీజన్‌లో లా లిగా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.
Also Read:బ్రదర్స్ & సిస్టర్స్ డే
2007లో, బెక్హాం మేజర్ లీగ్ సాకర్ క్లబ్ LA గెలాక్సీతో ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాడు. 100 UEFA ఛాంపియన్స్ లీగ్ గేమ్‌లు ఆడిన మొదటి బ్రిటిష్ ఫుట్‌బాల్ ఆటగాడు 20 సంవత్సరాల కెరీర్ తర్వాత మే 2013లో రిటైరయ్యాడు. అప్పటికే 19 ప్రధాన ట్రోఫీలను గెలుచుకున్నాడు. 2013లో ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించే ఆటగాడి జాబితాలో చేరిపోయారు. 1999లో విక్టోరియా బెక్హాంను వివాహం చేసుకోగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.
Also Read:IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?
2005లో ఫుట్‌బాల్ అకాడమీని స్ధాపించాడు. సాకర్ ప్రపంచంలోనే తన ఆటతీరుతోనే కాదు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ప్రేక్షకులు, మగువలను ఆకట్టుకున్నారు. పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్‌వేర్‌లకు మోడల్‌గా కూడా వ్యవహరించాడు. బెక్ హామ్ భార్య విక్టోరియా ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కావడంతో తన భర్త అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.