Superstar Krishna:బర్త్ డే స్పెషల్

75
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ శిఖరం ఆయన. వైవిధ్యమైన, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌. తెలుగు ఇండస్ట్రీకి కొత్త దనాన్ని పరిచయం చేయడంలో ఆయనది అందేవేసిన చేయి. ఎంతో మంది నిర్మాతలను తయారు చేసిన ఘనత ఆయన సొంతం. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31 న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతులకు జన్మించారు. కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. రమేష్ బాబు , మహేష్ బాబు . కుమార్తె మంజుల నటి రానించగా చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకున్నారు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుండి గుంటూరు ఎంపీగా ఉన్నారు.

తన కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించారు కృష్ణ. ఒకే నటితో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉంది. కృష్ణ తన సతీమణి, నిర్మాత, నటి విజయ నిర్మలతో 43 సినిమాలు (సుమారు), మరో నటి జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషనల్‌లో 31 సినిమాలు వచ్చాయి. అలాగే సూపర్‌ స్టార్‌ కృష్ణతో 80 మంది హీరోయిన్లు నటించారు.

Also Read:బ్రహ్మణ సదనం ప్రారంభం నేడే..

నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి సేవలందించారు. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారంటే చిన్న విషయమేమీ కాదు. ఒకే సంవత్సరం 17 సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు కృష్ణ.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఇక తెలుగు తెరకు మల్టీస్టారర్, ద్విపాత్రాభియం పరిచయం చేసిన ఘనత ఆయనకే చెల్లింది. ఎంతోమంది హీరోలు ద్విపాత్రాభినయం చేయగలిగారు కానీ అలాంటి సందర్భాల్లో త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు కృష్ణ.

Also Read:NDA:భారత్ మా తుజే సలామ్ పాట విడుదల

కుమార్‌రాజా,డాక్టర్‌ – సినీ యాక్టర్, రక్త సంబంధం,పగపట్టిన సింహాం వంటి సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. శంకర్ గురు అనే కన్నడ సినిమాను తెలుగులో కుమార్‌ రాజగా రీమేక్‌ చేసి తొలి త్రిపాత్రాభినయం సినిమా చేశారు కృష్ణ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో డాక్టర్ – సినీ యాక్టర్‌ అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. అలాగే సిరిపురం మొనగాడు, బంగారు కాపురం,బొబ్బిలి దొర వంటి చిత్రాల్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు కృష్ణ. గత సంవత్సరం అంటే 2022 నవంబర్ 15న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన భౌతికంగా మన నుండి దూరమైన ఇప్పటికి అభిమానుల హృదయాల్లో రియల్ సూపర్ స్టారే.

- Advertisement -