SSMB28:మహేష్ మాస్ లుక్‌

36
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 28వ సినిమా కాగా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ. గతంలో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇక తాజాగా ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో మహేష్‌కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. తనని రౌండప్ చేసిన రౌడీలను ఒక పట్టు పట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా మహేశ్ బాబు ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉండగా హారిక హాసిని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:MP Santhosh:బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం

ఇవాళ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేశారు. దాంతో ఘట్టమనేని అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. రీ రిలీజ్ లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

Also Read:Amla:ఉసిరితో ఉపయోగాలు

- Advertisement -