దర్శకధీరుడు ‘రాజమౌళి’ పుట్టినరోజు

289
- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని , క్రియేటివిటిని , కమర్షియల్ రేంజ్ ని పెంచిన దర్శకుడు రాజమౌళి. రాజమౌళి..ఏది చేసినా వైవిధ్యమే… వెరైటీ చూపించడమే రాజమౌళి బాణీ… అదే జనాన్ని విశేషంగా అలరిస్తోంది..రాజమౌళి సినిమా అంటే చాలు బాక్సాఫీస్ బద్దలవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది… అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Bahubali

విజయేంద్రప్రసాద్ గారి దంపతులకి అక్టోబర్ 10, 1973లో కర్ణాటకలో జన్మించారు. కే.రాఘవేంద్రరావు గారి వద్ద అసోసియేట్ దర్శకుడిగా తన కెరీర్ ప్రారభించిన రాజమౌళి ఆ తర్వాత రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్ లో ఓ టీవీ సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం 1’ సినిమాతో మొదలు పెట్టిన ఆయన విజయ పరంపర కొనసాగుతూనే ఉన్నది. రాజమౌళి ఒక్క ఎన్టీఆర్ తోనే మూడు సినిమాలు చేశాడు. వారి కాంబోలో ‘స్టూడెంట్ నెం.1’ , ‘సింహాద్రి’ , ‘యమదొంగ’ సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యాడు.

Baahubali

రాజమౌళి సినిమాలు….

2001-స్టూడెంట్ నంబర్ 1            జూనియర్ ఎన్.టి.ఆర్,గజాలా
2003-సింహాద్రి                          జూనియర్ ఎన్.టి.ఆర్., భూమిక
2004-సై                                  నితిన్, జెనీలియా
2005-చత్రపతి                         ప్రభాస్, శ్రియా
2006-విక్రమార్కుడు               రవితేజ, అనుష్క శెట్టి
2007-యమదొంగ                   జూనియర్ ఎన్.టి.ఆర్, ప్రియమణి
2009-మగధీర                        రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్
2010-మర్యాద రామన్న          సునీల్, సలోని
2012-ఈగ నాని                      సమంత, సుదీప్
2015-బాహుబలి                     ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా

SS Rajamouli & Rama Rajamouli @ Eega Working Stills

రాజమౌళి 2009 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి రూపొందించిన ‘మగధీర’ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డు ని సృష్టించింది. ‘బాహుబలి’తో రాజమౌళి పేరు ఖండాంతరాలలో వినిపిస్తోంది… ‘బాహుబలి’ రెండో భాగం విడుదల చేసే పనిలో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తరువాత ‘గరుడ’ అనే చిత్రాన్ని, ఆపైన మహాభారతాన్నీ తెరకెక్కిస్తారని సమాచారం. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని greattelangaana.com కోరుకుంటోంది.

rajamouli-bahubali

- Advertisement -