రాధికా మదన్..బర్త్ డే

33
- Advertisement -

మేరీ ఆషీకి తుమ్ సే హై టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ రాధికా మదన్. తర్వాత 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా అందరి ప్రశంసలు పొందింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. రే వెబ్ సిరీస్‌లో తన నటనకు గానూ విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

రాధిక మదన్ ఢిల్లీలో 1 మే 1995న జన్మించారు. ఆమె తండ్రి, సుజిత్ మదన్ వ్యాపారవేత్త.తల్లి నీరూ మదన్ పెయింటర్. ఆమెకు అర్జున్ మదన్ అనే సోదరుడు ఉన్నారు.మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత వెండితెరపై సత్తా చాటుతోంది. 2018లో విశాల్ భరద్వాజ్ కామెడీ పటాఖాతో సినీ రంగ ప్రవేశం చేసి ఉత్తమ మహిళా అరంగేట్ర హీరోయిన్ అవార్డును అందుకుంది. మర్ద్ కో దర్ద్ నహీ హోతా (2018), అంగ్రేజీ మీడియం (2020), షిద్దత్ (2021), ఆంథాలజీ సిరీస్ రే (2021), మరియు కుట్టే (2023) చిత్రాలలో నటించారు.

Also Read:తల్లైన స్వామి రారా బ్యూటీ!

2022లో, నెట్‌ఫ్లిక్స్ నియో-నోయిర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం మోనికా, ఓ మై డార్లింగ్‌లో ఆమె అతిథి పాత్రలో కనిపించింది. 2015లో జీ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ తొలి నటి,ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ న్యూకామార్,ఇండియన్ టెలి అవార్డ్స్ ఫ్రెష్ న్యూ పేస్ (మహిళా),2018 స్టార్ స్క్రీన్ అవార్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకామర్ (మహిళా),2019 జీ సినీ అవార్డ్స్ ఉత్తమ నటి – తొలి పరిచయం,64వ ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటి – తొలి పరిచయం అవార్డులు గెలుచుకుంది.

Also Read:హ్యాపీ బర్త్ డే… అజిత్

- Advertisement -