హ్యపీ బర్త్ డే…కార్తికేయ

287
karthikeya
- Advertisement -

ఆర్ఎక్స్ 100 చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో కార్తికేయ. తొలి సినిమాతో హిట్ సొంతం చేసుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. కార్తికేయ బర్త్ డే సందర్భంగా చావుకబురు చల్లగా టీం స్పెషల్ విషెస్ తెలిపింది.

వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన కార్తికేయ ఆర్ఎక్స్ 100 తర్వాత హిప్పీ చేసిన కార్తీకేయ తర్వాత గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇక ఆతర్వాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.

ప్రస్తుతం కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి డార్క్ కామెడీ కథతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న “చావు కబురు చల్లగా” లో నటిస్తున్నారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -