తెలంగాణ జాతిపితకు జన్మదిన శుభాకాంక్షాలు

467
Kcr
- Advertisement -

దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు 19ఏళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్ . నాడు ఎగిరిన గులాబీ జెండా నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా రెపరెపలాడుతుంది. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు..తెలంగాణ దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే. తెలంగాణ బాపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

1954 ఫిబ్రవరి 17న వెంకటమ్మ, రాఘవరావు దంపతులకు మెదక్ జిల్లా చింతమడకలో జన్మించారు కేసీఆర్. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీడీపీకి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2004లో కరీంనగర్ ఎంపీగా ఎన్నిక 2004లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం 2006 సెప్టెంబర్ 23న రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో అనే నినాదమిచ్చి ఉద్యమ వేడి రగిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏ మాత్రం తగ్గకుండా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకునే యత్నం చేశారు. 2009 నవంబర్‌ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఓ మైలురాయిగా నిలిచింది. ఆమరణ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంతో ఆస్పత్రిలోనే గులాబీదళపతి దీక్ష చేశారు. దీంతో ఎట్టకేలకు మన్మోహన్ ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందే వరకు… రాజకీయ చతురత చాటుకున్నారు. 2014 జూన్ 2న తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్…రెండోసారి టీఆర్ఎస్‌ను తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి తెచ్చారు.

ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందో ఆయనకు తెలుసు..ఏం చేస్తే తెలంగాణ ప్రజల జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయో తెలుసు..అందుకే ముందుగా విభజనతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దారు..ఓ పక్క ఉద్యోగుల లేమి, నిధులు లేమి, కరెంట్ కష్టాలు, ఆర్థిక అస్థిరత..అధికారం చేపట్టగానే కేసీఆర్ గారి ముందు ఉన్న సమస్యలు ..అయితే కేసీఆర్ సమర్థతతో,కార్యదక్షతతో అవలీలగా అన్ని సమస్యలను అధిగమించారు.

ఆరుగాలం కష్టించి పని చేసే రైతన్నలకు ఇప్పుడు పగటి పూటనే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుతుంది..ఇక రైతన్నలకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రుణమాఫీని విడతల వారీగా మాఫీ చేశారు..దీంతో రైతన్నలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. తెలంగాణ అంతటా మిషన్ కాకతీయ ద్వారా 40 వేల చెరువులను పునరుద్దరించారు.

తెలంగాణ అంతటా కోటి ఎకరాలకు సాగు నీరు అందించడానికి అపర భగీరథుడు వలె పది సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు..జలదౌత్యంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

తాగునీటీ కోసం మన ఆడబిడ్డలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ గారు ఇంటింటి సురక్షిత తాగు నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు.. ఏడాదిలోనే మిషన్ భగీరథ తొలి ఫలితాన్ని ప్రజలకు అందించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక పాలసీ (టీఎస్-ఐపాస్ )ను పారదర్శకంగా రూపొందించారు..దీంతో మన తెలంగాణ రెండేళ్లలోనే పెట్టుబడులకు,పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది.

పేదలంతా ధనికులతో సమానంగా సకల సౌకర్యాలతో సొంత ఇంటిలో ఆత్మగౌరవంతో సమున్నతంగా బతకాలని కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణ అంతటా పేదలకు దాదాపుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించాలని సంకల్పించారు. ఇక పేదలకు పరిమితులు లేని రేషన్ బియ్యం ద్వారా కడుపు నిండా తిండి, వృద్ధులకు, వితంతువులకు , వికలాంగులకు,బలహీనవర్గాల వారికి పింఛన్లతో వారి బతుకులకు ఆసరాగా నిలబడుతున్నారు. కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలతో పేదింటి అమ్మాయిల జీవితాల్లో కల్యాణ గంటలు మోగుతున్నాయి. సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నారు.

బంగారు తెలంగాణ కల సాకారం దిశగా అడుగులు వేస్తు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -