వరల్డ్ ఫేమస్ లవర్..2రోజుల కలెక్షన్లు

400
world famous lover
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రాశి ఖన్నా, ఇజా బెల్లా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్లుగా నటించారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచానాలతో విడుదలైన ఈమూవీ విజయ్ దేవరకొండ రేంజ్‌కు సరిపోయేలా వసూళ్లు రావడం లేదు. ఫస్ట్ షో నుంచే ఈమూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడింది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం తొలిరోజు కేవలం 5 కోట్లతో సరిపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక దాంతోపాటు రెండో రోజు కూడా కలెక్షన్స్ మెరుగుపడలేదు. సెకండ్ డే ఈ సినిమా 2.4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈమూవీ భారీగా డిజాస్టర్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా బిజినెస్ 20 కోట్లకు పైగానే జరిగింది. ఈసినిమాను తీసుకున్న డిస్ట్రీబ్యూటర్లు పెద్ద ఎత్తున నష్టపోయారనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -