‘హను-మాన్’..పాన్ వరల్డ్ రిలీజ్

37
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. మెస్మరైజింగ్ విజువల్స్, ఇంటెన్స్ మ్యూజిక్ తో అలరించిన టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని చూపించిన మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలో “రామ్.. రామ్..” అని జపిస్తూ శివలింగం ఎదుట హనుమంతుడు ధ్యానం చేస్తూ ప్రజంట్ చేసిన టీజర్ అద్భుతం అనిపించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు తమ దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారు. హను మాన్ అవుట్ పుట్ హాలీవుడ్ స్థాయిలో వచ్చింది. టీజర్‌కి వచ్చిన రిసెప్షన్‌ను చూసి, చిత్ర నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అవును.. హను మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, సహా పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ లో మే 12, 2023 వేసవిలో పాన్ వరల్డ్‌ రిలీజ్ కాబోతుంది.

అనౌన్స్‌మెంట్ వీడియో మరో టీజర్‌ను చూసిన అనుభూతిని ఇచ్చింది. కాషాయ రంగు మ్యాప్‌, బ్యాగ్ గ్రౌండ్ లో శ్రీ ఆంజనేయ స్తోత్రం ఉత్తేజకరమైన సంగీతంతో వినిపిస్తూ హను-మాన్ విడుదలలయ్యే దేశాలను చూపించే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వీడియో గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది,

హను-మాన్ “అంజనాద్రి”అనే అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లో సెట్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

ఇవి కూడా చదవండి..

- Advertisement -