పేరుకే చిన్న సినిమా.. కానీ రూ.231 కోట్లు

15
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘హను మాన్‌’ మూవీ భారీ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్‌ సంపాదించుకుని భారీ కలెక్షన్స్‌ వసూలు చేస్తోంది. రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా తాజాగా రూ.231 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. అటు హిందీలో కూడా ‘హ‌నుమాన్’ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. హ‌నుమాన్ సినిమా హిందీలో నిన్న రూ.1.25 కోట్లు సాధించింది.

దీంతో, ఇప్ప‌టివ‌ర‌కు హ‌ను మాన్ రూ.37.79 కోట్ల‌ను ఒక్క హిందీ భాష‌తోనే అందుకుంది. మొత్తానికి, ‘హ‌ను మాన్’ సినిమా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ‘హ‌ను మాన్’ హిందీ క‌లెక్ష‌న్స్ భారీగా వస్తున్నాయి. మొత్తానికి చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’కి మరో ఘనత కూడా దక్కింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ‘హనుమాన్‌’ టీమ్‌ ప్రతి టికెట్‌పై రూ.5 ఆ ఆలయానికి విరాళంగా ఇస్తామని ప్రకటించగా ఆ మాటను నిలబెట్టుకుంది కూడా.

ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే ఆలయానికి మూవీ టీమ్ అందించింది. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అన్నట్టు, హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా రానున్న జై హనుమాన్‌ను ఉద్దేశించి డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. ”జై హనుమాన్‌ మూవీ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఉంటుంది. వచ్చే సీక్వెల్‌లో హీరో తేజ సజ్జా కాదు. జై హనుమాన్‌లో హీరో ఆంజనేయ స్వామి. ఓ స్టార్ హీరో హనుమంతుడి రోల్ చేస్తారు”అని చెప్పారు.

Also Read:26న బీఆర్ఎస్‌పీపీ సమావేశం

- Advertisement -