దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తుండగా బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా బారత క్రికెటర్ హనుమ విహారి బాధితులకు అండగా నిలిచింది. దేశంలో ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. వీరితో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందిస్తున్నారు.
ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే అని ఇంటర్వ్యూలో వెల్లడించారు.