ముంచుకొస్తున్న తౌక్టే తుపాను..

93
storm

ఓ వైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు తుపాన్ రూపంలో ప్రమాదం పొంచిఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారగా దీని ప్రభావంతో ఐదు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు తౌక్టేగా నామకరణం చేయగా ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అధికారులు వెల్లడించారు.

తుపాను ప్రభావం ఉన్న ఐదు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపించారు. తుపాన్ వల్ల తీర ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, గోవా, మహారాష్ట్రలలో వర్షాలు కురుస్తాయని ఏపీ,తెలంగాణపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు.

జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.