పాతబస్తీలో జనం ఎక్కడా..?వీడియో షేర్ చేసిన సీపీ

72
old city

రాష్ట్రంలో లాక్ డౌన్‌ నాలుగో రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల తర్వాత లాక్ డౌన్‌ పూర్తిస్ధాయిలో అమల్లోకి రాగా పాతబస్తీలో లాక్ డౌన్ అమలుపై పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పాతబస్తీలో లాక్ డౌన్ అమలు కావడం లేదని కొంతమంది ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తుండటంతో స్వయంగా రంగంలోకి దిగారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

రంజాన్ రోజు‌న ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. ఏ గల్లీలో కూడా నలుగురు గుమిగూడి ఎక్కడ కనిపించలేదన్నారు. పౌరులంతాచట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు.