తెనాలి రామకృష్ణ.. హన్సిక లుక్ వైరల్

488
hansika
- Advertisement -

శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`. ఈ చిత్రంలో హీరోయిన్ హన్సిక పుట్టినరోజు ఆగస్ట్ 9. ఈ సందర్భంగా హన్సిక ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో హన్సిక ఫార్మల్‌గానే కనపడుతుంది. అయితే ఈ చిత్రంలో హన్సిక లాయర్ పాత్రలో కనపడుతుంది.

తొలిసారి హన్సిక లాయర్ పాత్రలో నటిస్తుండటం ఆమెకు చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. టాకీపార్ట్ అంతా పూర్తయ్యింది. కేవలం పాటలను చిత్రీకరించాల్సి ఉంది.
సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

నటీనటులు:సందీప్ కిషన్, హన్సిక, మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు.

- Advertisement -