విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

82
- Advertisement -

తెలంగాణలో నానాటికీ ప‌గ‌టి పూట ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఒంటి పూట బ‌డుల‌కు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి ఒంటి పూట బ‌డులు నిర్వ‌హించాల‌ని అన్ని పాఠ‌శాల‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు శ‌నివారం తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న‌ ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

- Advertisement -