వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

5
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగం ధ్వంసమైంది. దీంతో ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

వడగళ్ల వర్షం వల్ల విమానం ముందు భాగం దెబ్బతినడంతో భయాందోళనతో కేకలు వేశారు ప్రయాణికులు. అయితే, సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది విమానం.

విమానంలో 227 మంది ప్రయాణికులు ఉండగా వారితో పాటు సిబ్బంది సురక్షితంగా ఉంది.

Also Read:Chiru 157:వింటేజ్‌ లుక్‌లో చిరు!

- Advertisement -