హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురియగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం పడటంతో సిటీలోని ఉప్పల్, మలక్ పేట, సరూర్ నగర్, ఎల్బీనగర్ బంజారాహిల్స్, షేక్‌పేట్, సికింద్రాబాద్, సనత్ నగర్ బేగంపేట, అమీర్‌పేట జలమయం అయింది.
రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు.ఆఫీస్‌లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు మధ్య తెలంగాణలో జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

