రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం సందర్భంగా బషీర్ బాగ్ లోని ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు టి.ఎస్.ఐ ఐ.సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు. తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టి.ఎస్.ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలుపుతూ అనంతరం మాట్లాడుతూ ఈనెల 17 వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ” కోటి వృక్షార్చన ” ఒకే రోజు – ఒకే గంటలో- ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో భాగస్వాములు అయి ప్రతి ఒక్కరు మొక్కులు నాటి మొబైల్ పంపించగలరు అని కోరారు.
ఇందుకోసం మొబైల్ యాప్ కోసం మీ వాట్సప్ నుండి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలని పిలుపునిచ్చారు.హరిత సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వనమాలి బిరుదును మీకు ఈ మెయిల్ , మొబైల్ కు వారం రోజుల్లో పంపబడుతుంది అని తెలిపారు బాలమల్లు.