- Advertisement -
మున్సిపల్ మరియు ఐ టీ శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. యుక్త వయసులోనే చదువు పూర్తి చేసుకొని తెలంగాణ ఉద్యమం లో పాల్గొని ప్రజలతో మమేకమై ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం లో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నందుకు సంతోషమన్నారు దత్తాత్రేయ.
కొత్త ఆలోచనలతో సరికొత్త టెక్నాలజీ ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమనే ఆలోచనతో పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి గా ఈ కరోనా విపత్కర సమయం లోను చురుకుగా పనిచేస్తున్న రామారావు అభినందనీయుడు అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం సకారాత్మక ఆలోచనలతో ముందుకు పోతున్న కే టీ రామారావుకి భవిషత్ లో మరిన్ని విజయాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు దత్తాత్రేయ.
- Advertisement -