బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 13 హైలైట్స్

28
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 13 ఎపిసోడ్స పూర్తి చేసుకుంది. 13వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రియ- కాజల్ మధ్య మరోసారి మాటల యుద్దం జరుగగా ప్రియా…కాజల్‌ని ఆటాడుకుంది.

తొలుత విశ్వ… కొత్త కెప్టెన్‌గా ఇంటి సభ్యులకు నియమ నిబంధనల ఉల్లంఘన గురించి ఇంటి సభ్యులకు వివరించారు. ఆ తర్వాత బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్…కంటెస్టెంట్లు బజర్‌ మోగగానే బంతిని పట్టుకోవాలి. ఒక్కో బాల్ మీద ఒక్కో ఐటం పేరు రాసి ఉంటుంది. ఆ బాల్ పట్టుకుంటే.. ఆ ఫుడ్ ఇంటి సభ్యుల సొంతం అవుతుందని చెప్పగా విశ్వ రసగుల్ల ఉన్న బాల్‌ను వదిలేశాడు. లహరి మటన్ బిర్యానీ బాల్‌ను వదిలేయగా… లోబో పన్నీర్ బాల్‌ను వదిలేశాడు. బెస్ట్, వరెస్ట్ పర్ఫార్మర్‌లను ఏకాభిప్రాయంతో ఎంచుకోమన్నాడు బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఎక్కువ మంది నటరాజ్ మాస్టర్‌ను బెస్ట్ పర్ఫార్మర్, సన్నీని వరస్ట్‌ పర్ఫార్మర్‌గా ఎంచుకున్నారు.

ఇక ఆటలో సన్నీ ఆడిన తీరును అందరూ ఎండగట్టారు. అగ్రెసివ్ అయ్యారు.. మాట్లాడిన తీరు బాగా లేదంటూ అందరూ కార్నర్ చేశారు. ఇక తర్వాత కాజల్ – ప్రియ మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇంట్లో అసలు కిచెన్ డిపార్ట్మెంట్ పనులను చేయను అంటూ భీష్మించుకుని కూర్చున్న కాజల్‌కు ఆ పనే పడింది. నేను ఈ పనులు చేస్తుంటే మీరు ఫీల్ అవుతున్నారా? అని ప్రియను కాజల్ అడగగా నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని ప్రియా చెప్పడం తనకు నచ్చ లేదు అని కాజల్ పెద్ద రచ్చ చేసింది.

తర్వాత ఇద్దల మధ్య మాటలయుద్దం జరుగగా కాజల్ బాధపడుతుంటే.. దగ్గరకువెళ్లి సారి చెప్పేసింది ప్రియా.