తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లో వందేళ్ల ప్రగతిని సాధించామన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
తెలంగాణ శాసన మండలిలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ,మహాత్మా గాంధీ చిత్రపటాలకు పులా మాల వేసి నివాళులు అర్పించారు గుత్తా.అనంతరం శాసన మండలిలో జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గుత్తా.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తరువాత అభివృద్ధికి నోచుకుందన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో నడిపిన నాయకుడిని ముఖ్యమంత్రి గా ఎన్నుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం అన్నారు.
బీడు భూముల్లో కూడా రెండు పంటలు పండించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేశారని…త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు లు పూర్తి కాబోతున్నాయని చెప్పారు. దేశంలోనే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్టం గా ఉందన్నారు. కేటీఆర్ కృషితో ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎనలేని అభివృద్ధి సాధించిందని..ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.