తెలంగాణ ప్రజల సేవలు చిరస్మరణీయం: రామ్‌నాథ్

267
ramnath kovind
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం అన్నారు.

కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎం సాహ్ని, తెలంగాణ భవన్ ఓఎస్డీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్. తెలంగాణ భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎం సాహ్ని.

- Advertisement -