- Advertisement -
తన జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శాసన మండలి ప్రాంగణంలో మొక్కలు నాటారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
అనంతరం గుత్తా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -