ప్రభుత్వ మాజీ సలహాదారు‌ పార్ధివదేహానికి గుత్తా నివాళి..

62
gutha

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-పంచవటి కాలనీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారులు రామ్ లక్ష్మణ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రామ్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఐఏఏస్‌ అధికారిగా, ప్రభుత్వ సలహాదారుగా ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి,రామ్ లక్ష్మణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.