- Advertisement -
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు.ఛాతిలో నోప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. నల్గొండలోని తన నివాసంలో శనివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన ఆయన నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే నాళాలు రెండు చోట్ల మూసుకుపోయినట్టు గుర్తించారు. ఆ వెంటనే రెండు స్టెంట్లు వేశారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గుత్తా ఆర్యోగంపై ఆరా తీశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి గుత్తాను పరామర్శించారు. ప్రస్తుతం గుత్తా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
- Advertisement -