అందరూ సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను పాటించాలి..

349
Gutha Sukender Reddy
- Advertisement -

మిర్యాలగూడ పట్టణంలోని సీతారాం పురం,సుందర్ నగర్ కాలనీ వాసులకు ది పీపుల్ ఆఫ్ మిర్యాలగూడ ఎన్నారై ,టీఎన్‌బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఉచిత కూరగాయలు పంపిణీ చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన శాసన మండలి చైర్మన్ లాక్ డౌన్ పాటించాలి అని ప్రజలను హెచ్చరించారు. ఎవరు కూడా ఊహించని విధంగా కరోన అనే మహమ్మారి వైరస్ ప్రభలుతోందని అన్నారు.

నిర్లక్ష్యం కారణంగా మన కన్న బాగా అభివృద్ధి చెందిన అమెరికా,ఇటలీ,స్పెయిన్,చైనా లాంటి దేశాలు కరోన వైరస్ కారణంగా విలవిలాడుతున్నాయి. మన దేశ ప్రధానమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో లాక్ డౌన్ కి పిలుపు ఇవ్వడంతో వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నామన్నారు. కరోన వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎలాంటి భయానికి,మోహమాటనికి లోను కాకుండా వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేసిన ఆయన కుటుంబం వైరస్ కి బలి అవుతుందని హెచ్చరించారు.

ప్రజలు అందరు సంపూర్ణంగా లాక్ డౌన్ ని పాటించాలి.సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు మెలగాలి. ప్రజలు చాలా సంయమనం పాటించాల్సిన సమయం ఇది. ఎవరు కూడా ఎలాంటి అపోహలకు లోనుకావొద్దు. వదంతులు నమ్మి వాట్స్ అప్ ,ఫేస్ బుక్ లలో ప్రచారం చేయొద్దు. ఏ మతానికి చెందిన వ్యక్తులు కూడా కరోన వైరస్ ని వ్యాప్తి చేయాలి అని చూడారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించి లాక్ డౌన్ ని పాటించాలి. అత్యవసరం అయితేనే ఇంటి నుండి బయటకు రావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాని ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోవడం సాధ్యం కాదు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. త్వరలోనే కరోన మహమ్మరిని మన దేశం,రాష్ట్రం నుండి తరిమికొడుతం అనే నమ్మకం ఉన్నది.

ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్, జడ్పీటీసీ తిప్పన విజయసింహా రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ చింతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,RDO రోహిత్ సింగ్,మున్సిపల్ కమిషనర్ వెంకన్న,మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముగ్ధుమ్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్ ఉదయ్ భాస్కర్,మాలగం రమేష్, మార్కెట్ డైరెక్టర్ అల్లని రమేష్,నాయకులు హన్మంత్ రెడ్డి,రేపాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -