15లోగా పనులు పూర్తిచేయండి: కేటీఆర్

119
ktr

తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా కోసం ఏర్పాటుచేస్తున్న ఆస్పత్రులను పరిశీలించారు మంత్రి కేటీఆర్.

మొయినాబాద్ లోని భాస్కరా మెడికల్ కాలేజీ,గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు కేటీఆర్.

రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంను ఈ నెల 15లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపు 15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాంప్లెక్స్‌లో ఆస్పత్రి భవనం పనులు పూర్తయితే దాదాపు 1500 పడకలు అందుబాటులోకి రానున్నాయి.