నాసా సదస్సుకు ఎంపికైన మైనార్టీ గురుకులాల విద్యార్థులను సీఎం కేసీఆర్ అభినందించారు. మే 24 నుంచి 27వ తేదీ వరకు లాస్ ఏంజెలిస్ లో జరగనున్న స్పేస్ కాన్ఫరెన్స్ కు ఆరుగురు మైనార్టీ గురుకులాల విద్యార్థులను నాసా ఎంపిక చేసింది. ఈ ఆరుగురు విద్యార్థులు ప్లానెటరీ సోసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఫ్యూజన్ ఎల్ 5 ప్రాజెక్టును రూపొందించారు. సయ్యద్ ఇబ్రహీం(8వ తరగతి), సఫ మహీన(9వ తరగతి), మహవీన్ మహ్మదీ(7వ తరగతి), ఫిరోజ్ హుస్సేన్(8వ తరగతి), ముస్కాన్ తబస్సుమ్(8వ తరగతి), ఫిరోజ్ అహ్మద్(8వ తరగతి) స్పేస్ కాన్ఫరెన్స్‌కు ఎంపియ్యారు.
విద్యార్థులు నాసా ఎంపిక పట్ల సీఎం కేసీఆర్ హర్హం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు మైనార్టీ గురుకులాల సంస్థ కార్యదర్శి షఫిముల్లాను సీఎం అభినందించారు. విద్యార్థులకు భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ గుర్తింపులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు నాసా నుంచి ఆహ్వానం రావడం రాష్ట్రంలోనే తొలిసారని, విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని షఫిముల్లా పేర్కొన్నారు