పాండ్యాతో రోహిత్ రిస్క్ తీసుకుంటాడా…

335
- Advertisement -

ఐపీఎల్-11 సీజన్‎లో భాగంగా నేడు ఉప్పల్‎లో సన్‎రైజర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‎లో చెన్నైతో ఓడిపోయిన ముంబై, రెండో మ్యాచ్ హైదరాబాద్‎తో తలపడనుంది. ఈ రోజు మ్యాచ్‎లో ముంబై స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి మ్యాచ్‎లో బ్యాటింగ్ చేస్తూ..పాండ్య గాయపడ్డాడు. ఆఖరి ఓవర్‎లో బ్రావో వేసిన ఆఖరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో అతడి కాలికి గాయమైంది.

Rohith risk playing Hardik vs SRH

సోమవారం రోజున ముంబై కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. సన్ రైజర్స్‎తో మ్యాచ్‎కు ఇంకా మూడో రోజుల సమయం ఉందని అప్పటిలోగా పాండ్యా కోలుకుంటాడని రోహిత్ వెల్లడించాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత పాండ్య కోలుకున్నాడని రోహిత్ తెలియజేశాడు. కానీ నేటి ప్రాక్టీస్ మ్యాచ్‎లో పాండ్య కనిపించక పోవడంతో.. పాండ్యా ఆడతాడో లేదో అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయం తీవ్రత తక్కువగా ఉన్నపటికీ అతన్ని ఆడించి రోహిత్ రిస్క్ తీసుకుంటాడో లేదో చూడాలి. అతడు ఆడేది లేనిది తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే

- Advertisement -