ఆమెతో నటించొద్దనే హక్కు ఎవరికీ లేదు.. తమ్మారెడ్డి

221
- Advertisement -

టాలీవుడులో కాస్టింగ్ కౌచ్‎పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి రోజు రోజుకు మద్దతు పెరిగిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాలకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుంది. ఇదేసమయంలో ఆమెకు మద్దతుగా జాతీయ హక్కుల కమిషన్ నిలిచింది. మరో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా సపోర్టుగా నిలిచారు. ఆమెను సినిమాల్లో నట్టించకుండా అడ్డుకోవడం ముమ్మాటికి ఆమె హక్కులను కాలరాయడమే అని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.

Bharadwaj Responds on Actress Sri Reddy's
ఈ మేరకు తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. కేంద్ర మానవ హక్కుల కమిషన్‎ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ… ఆ కమిషనే ఆమె కేసును సుమాటోగా స్వీకరించి, చివరకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఆమెతో కలిసి పని చేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదని తమ్మారెడ్డి భరద్వాజ కూడా అన్నారు. “నా ఆలోచన’ సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ శ్రీరెడ్డి అన్నంత పని చేసిందని, ఆ అమ్మాయి గొడవ మొదలుపెట్టినప్పటి నుంచే నేను చెబుతూ ఉన్నాను .. ఎవరో ఒకరు పిలిచి మాట్లాడాలని. నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను! ఆ అమ్మాయి ఏంటీ? అనే దాని గురించి పక్కన పెడితే.. అమె లేవనెత్తిన సమస్య గురించి మాట్లాడుకోవడం అవసరమన్నారు.

ఆ అమ్మాయి లేవనెత్తిన సమస్య ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఎలా నియంత్రించాలి? దానికి కొన్ని పరిష్కారాలు నేను ఇప్పటికే చెప్పాను. ఇప్పటికైనా ఆమెతో మళ్లీ మాట్లాడుకోవచ్చు అని భరద్వాజ తెలిపారు. అసలు ఈ పరిస్థితి రానివ్వచ్చా? ఆలోచించడానికి సంఘాలున్నాయి కదా అని మనం ఆలోచించడం మానేశామని అన్నారు. వాళ్లు ఉన్నారులే అని సంఘాలు, సంఘంలోని నాయకులు అనుకోవడం వల్లే ఇంతవరకు వచ్చందని భరద్వాజ పేర్కొన్నారు.

- Advertisement -