గురుపౌర్ణమి విశిష్టత…

521
guru purnima
- Advertisement -

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. గురు పూర్ణిమ‌… గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే గురు పూర్ణిమ‌. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆషాఢ శుద్ధ పౌర్ణ‌మి (జూన్ – జులై) రోజున హిందువులు గురు పూర్ణిమ ను జ‌రుపుకుంటారు.

ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉప‌వాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉద‌యించిన త‌ర్వాత ఆహారం తీసుకుంటారు. ఇది గురు పూర్ణిమ విశిష్ట‌త‌. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగ గురు పూర్ణిమ. అంతేకాకుండా గురుపౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడటం వరుసగా ఇది మూడోసారి.గురు పూర్ణిమ నేపథ్యంలో సాధారణంగా షిర్డీకి భక్తులు పోటెత్తుతారు. కానీ ఈసారి కరోనా కారణంగా అలాంటి పరిస్ధితి కనిపించడం లేదు.

- Advertisement -