ధోని,యూవీ కలిసిపోయారోచ్‌..

94

యువీ, ధోనీ మధ్య ఫ్రెండ్‌షిప్ చెడిపోయిందని అందుకే ఇద్దరు మాట్లాడుకోవడం లేదని గత కొంతకాలంగా క్రికెట్ అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం ఇది. అందుకే ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో యూవీని పక్కన పెట్టేశాడనే  వార్తలు కూడా షికార్లు చేశాయి. అయితే వీటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ..ఇద్దరు కలిసి సరదాగా ముచ్చటించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు యూవీ. ఇంగ్లండ్‌తో ఇండియా ఎ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ధోనీ భుజంపై చేయి వేసి యువీ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఈ సంద‌ర్భంగా ప‌దేళ్ల ధోనీ కెప్టెన్సీపై ఇద్ద‌రూ త‌మ అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నారు. ఈ పదేళ్ల జర్నీలో తాము ఇద్దరం చాలా ఎంజాయ్ చేశామని తెలిపారు. ధోనీని టీమిండియా బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించిన యువీ.. అత‌ని కెప్టెన్సీలో ఆడ‌టాన్ని ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు.

yuvraj

చాంపియన్స్ ట్రోఫి, వరల్డ్ కప్, ఇండియా నెంబర్‌1 టీం, ఇలా భారత్‌కు కెప్టెన్‌ గా ధోని ఎన్నో విజయాలు అందించాడని యూవరాజ్‌ సింగ్ అభివర్ణించాడు. ఇక ధోని కూడా యూవీని పొగడ్తల్లో ముంచేశాడు. యూవీ ఆరు సిక్స్‌ లను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నాడు. ధోనికి కెప్టెన్సీ భారం దిగిపోయింది..ఇక పాత ధోనీని మ‌ళ్లీ చూపించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని యువీ అన్నాడు. వీడియో చివ‌ర్లో ఇక ఇప్ప‌టి నుంచి ఎన్ని సిక్స‌ర్లు బాదుతావ్ అని స‌ర‌దాగా యువీ అడిగిన ప్ర‌శ్న‌కు ధోనీ స‌మాధాన‌మిచ్చాడు. అది టైమ్‌ను బ‌ట్టి డిసైడ‌వుతా అని మిస్ట‌ర్ కూల్ అన్నాడు. చాలా రోజుల తర్వాత ధోని, యూవీని ఇలా చూసిన క్రికెట్ అభిమానులు చాలా సంతోషంగా ఫీలౌవుతున్నారు.