అఖిల్ కంటే ముందే చైతూ పెళ్లి…!

351
Naga Chaitanya To Marry Before Akhil
- Advertisement -

అక్కినేని వారిట్లో పెళ్లిసందడి మొదలైంది. అన్న నాగచైతన్య కంటే ముందే తమ్ముడు అఖిల్ ఎంగెజ్ మెంట్‌ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి త్వరలోనే ఇటలీలోని రోమ్‌లో జరగనుంది. అయితే, వీరి పెళ్లికంటే ముందే నాగచైతన్య పెళ్లి జరగనుందట. ఇప్పుడు ఇదే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.

త్వ‌ర‌లోనే నాగచైతన్య, సమంత ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుగుతుంద‌ని టీ- టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాదు అఖిల్ పెళ్లికంటే ముందే చైతూ పెళ్లిని ఘనంగా నిర్వహించాలని నాగ్ పట్టుదలతో ఉన్నాడట. జనవరి 29న చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై నాగ్ ఇంట్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయట.

Naga Chaitanya To Marry Before Akhil

అంతేగాదు అఖిల్‌–శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుండటంతో చైతూ పెళ్లి కూడా విదేశాల్లో చేస్తే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నాడట. అయితే, నాగ్-సమంత మాత్రం చాలా సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లిచేసుకుంటామని చెప్పారట. దీంతో నాగ్ కుటుంబంలో కలహాలు అప్పుడే మొదలయ్యాయట. పెళ్లి విషయంపై మీడియాకు పదే పదే లీకులు ఇస్తుండటం…పెళ్లి సింపుల్‌గా చేసుకుంటామన్న సమంత-చైతూ వ్యాఖ్యలతో నాగ్ విభేదించాడట. మరీముఖ్యంగా సమంత తీరుపై నాగార్జున గుర్రుగా ఉన్నాడని ఇండస్ట్రీలో రూమర్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అక్కినేని తనయుల వివాహంపై టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. నాగ చైతన్య – సమంత, అఖిల్ – శ్రియా భూపాల్ వివాహాలపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అంతా అయోమయానికి గురవతున్నారు. అక్కినేని ఫ్యామిలీలో ఎవరు ముందుగా పెళ్లిపీటలు ఎక్కుతారోనన్న ఆసక్తి నెలకొంది.

Naga Chaitanya To Marry Before Akhil

- Advertisement -