‘గుంటూరు కారం’ టార్గెట్ ఎంతంటే?

24
- Advertisement -

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ గుంటూరు కారం. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత‌ వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో గుంటూరు కారంపై మంచి హైప్ నెలకొంది. ఆ హైప్ వ‌ల్లే ఈ సినిమాకు రూ.113 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగింది. పండుగ సీజ‌న్‌లో రిలీజ్ అవుతుండ‌టంతో ఈ టార్గెట్‌ను రీచ్ కావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇక టాక్ బాగుంటే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల పంట పండటం ఖాయం. అన్నట్టు ఏపీలో గుంటూరు కారం సినిమా టికెట్ల ధరలు పెంపుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.

టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు అంగీకారం తెలిపింది. ఈనెల 12 నుంచి 21వరకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకోవచ్చునని తెలుపుతూ ఏపీ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైబడ్జెట్టు సినిమా కావడంతో టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ఆదేశాలలో పేర్కొంది. మొత్తానికి ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రాబోతున్నాయి. ఎంతైనా మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ అంటే.. ఆ హైప్ ఉంటుంది మరి.

ఇక గుంటూరు కారం సినిమా మ‌రికొద్ది గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ఫుల్ పాజిటివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కాకపోతే, ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. గుంటూరు కారం క‌థ‌, మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి న‌టించిన ‘రాజ‌మాణిక్యం’ అనే సినిమా క‌థ‌కు ద‌గ్గ‌రగా ఉంద‌ని అంటున్నారు. ఇందులో నిజ‌మెంత‌నేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వర‌కు ఆగాల్సిందే.

Also Read:ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు..

- Advertisement -